Header Banner

విద్యా రంగానికి పయ్యావుల కేశవ్ గుడ్ న్యూస్! ఆ స్కూళ్లకు ఉచిత విద్యుత్.. బడ్జెట్‌లో కీలక ప్రకటన!

  Fri Feb 28, 2025 19:35        Politics

2025-26 ఆర్థిక సంవత్సరానిక గాను ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శుక్రవారం ఏపీ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో విద్యా, మున్సిపాల్టీలు, తెలుగు భాషాభివృద్ధి వంటి అంశాలపై కీలక విధాన నిర్ణయాలు ప్రకటించారు. ఇకపై అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి ప్రకటించారు. ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్ అందించడంతో స్థానిక సంస్థలకు విద్యుత్ ఛార్జీల భారం తగ్గుతుందని అన్నారు. కేంద్రీకృత బిల్లుల చెల్లింపుల విధానం నుంచి మున్సిపాల్టీలకు విముక్తి కల్పిస్తున్నట్లు వెల్లడించారు. 2024 ఏప్రిల్ నెల నుంచి తమ బిల్లులను తామే చెల్లింపులు జరుపుకునేలా మున్సిపాల్టీలకు స్వేచ్ఛ నిస్తున్నట్లు తెలిపారు.


ఇది కూడా చదవండి: 2026 తర్వాత పెరిగే లోక్ సభ సీట్లివే ? రాష్ట్రాల వారీగా ఇలా..!


తెలుగు భాషాభివృద్ధికి రూ.10 కోట్లు..
క్యాపిటల్ ఎక్స్ పెడించర్ ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రత్యేక ప్రణాళికలు గురించి ప్రస్తావించారు. ప్రవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి నిర్ణయం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ప్రొత్సాహకంగా ప్రాజెక్టులో 20 శాతం మేర వయబులిటి గ్యాప్ ఫండింగ్ ఇచ్చేలా కూటమి ప్రభుత్వం స్కీం డిజైన్ చేసినట్లు వెల్లడించారు. ప్రాజెక్టుల గ్యాప్ ఫండింగ్ స్కీం కోసం రూ.2 వేల కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తొలిసారిగా తెలుగు భాషకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. తెలుగు భాషాభివృద్ధికి రూ.10 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.


ఇది కూడా చదవండి: క్రిప్టో కరెన్సీ పేరుతో సుమారు 25 కోట్లకు టోకరా.. కట్ చేస్తే.. తమన్నా, కాజల్‌ను విచారించనున్న పోలీసులు!


తెలుగు భాషకు తామిచ్చే ప్రాధాన్యతను తెలియజేప్పేందుకే ఈ నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగంపై వ్యతిరేక ప్రచారం కోసం బడ్జెట్టులో ప్రత్యేక కేటాయింపులు కూడా కేటాయించారు. నవోదయం 2.0 స్కీం కింద మద్యపాన, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం కోసం నిధుల కేటాయింపులు చేసినట్లు తెలిపారు. కాలుష్య రహిత ఆంధ్రగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేలా ప్రణాళికలు చేపడుతున్నట్టు బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి పయ్యావుల ప్రస్తావించారు. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. జీరో కాలుష్యం ఉండేలా ప్రణాళికలు రూపకల్పనపై బడ్జెట్టులో ప్రస్తావించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:

అసలు నిజాన్ని బయటపెట్టిన పోసాని.. ఆ పదవి కోసమే... వారు చెప్పినట్టే చేశాను! సుమారు 9 గంటలపాటు..

 

నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్.. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు..

 

పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

 

భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

 

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapraavsi #free #current #schools #todaynews #flashnews #latestnews